మహేష్ దర్శకుడిపై మనసు పారేసుకున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడితో చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. ఎంటర్టైన్మెంట్ కి హీరోయిజం జోడించి అనిల్ రావిపూడి చిత్రాలు కొత్తగా తీస్తారు. ప్రతి హీరోని మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్ లో ప్రజెంట్ చేయడం అనిల్ ప్రత్యేకత. దానికి తోడు చిత్రాన్ని చాలా త్వరగా పూర్తి చేసే గొప్ప లక్షణం కూడా అతనికి ఉంది. దీనితో ఆయన అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తుంది.

గత ఏడాది ఎఫ్2 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాక అనిల్ రావిపూడి పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు. అందుకే మహేష్ అనిల్ రావిపూడి కి సరిలేరు నీకెవ్వరు చేసే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. సంక్రాంతి బరిలో దిగుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ హిట్ కొడితే ఈ దర్శకుడి దశ తిరిగినట్లే.అదే జరిగితే హిట్ చిత్రాల దర్శకుల జాబితాలో చేరిపోవడం ఖాయం. ఇక రామ్ చరణ్ తో మూవీ కన్ఫర్మ్ అయితే స్టార్ డైరెక్టర్ హోదా దక్కినట్లే. ఐతే రామ్ చరణ్ అనిల్ రావిపూడితో చిత్రం చేయాలా వద్దా అనేది, మహేష్ మూవీ విజయం పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సరిలేరు నీకెవ్వరు మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంటే రామ్ చరణ్ మనసు మార్చుకొనే అవకాశం కలదు.రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా ఈ ఏడాది జులై 30న విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ 65 నుండి 70 శాతం వరకు పూర్తయిందని ఇటీవల చరణ్ ఓ సంధర్భంలో చెప్పుకొచ్చారు. ఒక వేళ అన్నీ కుదిరి అనిల్ రావిపూడి-చరణ్ ల మూవీ పట్టాలెక్కినా అది వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus