Ram Charan: బెనిఫిట్ షోలకు వెళ్లిన చరణ్ ఫ్యాన్స్ అలా ఫీలయ్యారా.. ఏమైందంటే?

Advertisement

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ తొలిరోజే 115 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో లియో ఒకటి కావడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం లియో విషయంలో మోసం చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. లియో మూవీ బెనిఫిట్ షోలకు వెళ్లిన రామ్ చరణ్ అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశకు గురయ్యారు.

లియో విషయంలో రామ్ చరణ్ (Ram Charan) గురించి ముందుగానే స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని తమ ఫీలింగ్స్ తో ఆడుకోవడం కరెక్ట్ కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ కొన్ని సెకన్ల పాటు అయినా కనిపిస్తాడని ఆశించామని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. లియో సినిమా కలెక్షన్లు మాత్రం భారీ రేంజ్ లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రెయిట్ సినిమాలకు పోటీగా ఈ సినిమాకు బుకింగ్స్ జరిగాయి.

బుక్ మై షో వెబ్ సైట్ లో ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. విజయ్ కెరీర్ లోనే ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలిచే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లియో సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయి.

లోకేశ్ గత సినిమాల స్థాయిలో లేదని కొంతమంది చెబుతున్నా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు లోకేశ్ కనగరాజ్ కు క్రేజ్ పెరుగుతోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read