Ram Charan, Kavya Thapar: చరణ్ పేరును మరిచిపోయిన హీరోయిన్ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

రవితేజ హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు త్వరలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈగల్ అనే సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కావ్యకు RRR సినిమా హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ఇందులో భాగంగా ఈమె ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తన నటన చాలా అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ డాన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ ఎన్టీఆర్ పట్ల ఎంతో గొప్పగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇక రాంచరణ్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ రామ్ చరణ్ అనే పేరు పలకడానికి కూడా రాకపోవడంతో ఏకంగా రాజు అంటూ హీరో పేరును సంబోధించారు దీంతో తన పేరు రామ్ చరణ్ అంటూ యాంకర్ చెప్పారు. ఆ రామ్ చరణ్ నటించిన రాజమండ్రి సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ మాట్లాడటంతో యాంకర్ ఒక్కసారిగా షాక్ అవుతా అది రాజమండ్రి సినిమా కాదండి రంగస్థలం అంటూ ఆమెకు చెప్పుకు వచ్చారు .

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతం అంటూ ఈమె చెప్పడమే కాకుండా తనకు వస్తువుల పేర్లు మనుషుల పేర్లు పెద్దగా గుర్తుండవు అంటూ కవర్ చేసుకొని ప్రయత్నం చేశారు. అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమాని కాస్త రాజమండ్రిగా చేయడంతో రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు ఒక్కసారిగా ఈమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/i/status/1740664107563675777

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus