Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Advertisement

1990లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకానిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి(Chiranjeevi), శ్రీదేవి (Sridevi) జంటగా నటించిన ఈ చిత్రం, రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో అశ్వినీదత్ (C. Aswani Dutt) నిర్మాణంలో వచ్చి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ సినిమాను 2డీ, 3డీ వెర్షన్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ హోర్డింగ్స్, ప్రమోషన్ ఈవెంట్స్‌తో హడావిడి చేశారు.

Ram Charan

ఈ సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అశ్వినీదత్ ఈ సీక్వెల్ ఆలోచనపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నాడు, కానీ రాఘవేంద్రరావు మాత్రం ఈ ఆలోచనపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే, రీసెంట్ రీ-రిలీజ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ, ఈ సీక్వెల్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సినిమాలోని రింగ్, చేప ఎలాంటి మిస్టరీని కలిగి ఉన్నాయని, వాటి కథను కొనసాగించాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను (Nag Ashwin) డిమాండ్ చేస్తున్నానని చెప్పాడు.

రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో సీక్వెల్‌పై ఆసక్తిని మరింత పెంచాయి. చిరంజీవి కూడా ఈ సీక్వెల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటిస్తే బాగుంటుందని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ పేరును చరణ్ ప్రస్తావించడం ఈ సీక్వెల్‌పై తెరవెనుక చర్చలు జరుగుతున్నాయనే సంకేతమని అంటున్నారు.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ, చరణ్ డిమాండ్‌ను సీరియస్‌గా తీసుకుని ఈ సీక్వెల్‌ను తెరపైకి తీసుకొస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌లో నాగ్ అశ్విన్ లాంటి విజనరీ డైరెక్టర్ పనిచేస్తే, ఈ సినిమా మరో సంచలనాన్ని సృష్టించవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సీక్వెల్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటతో తెరపైకి వస్తే, అప్పటి మ్యాజిక్‌ను ఈ తరానికి మరోసారి అందించే అవకాశం ఉంటుంది.

సెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus