Ram Charan: మీ షో కోసం చరణ్ సరికొత్త యాడ్ వీడియో… మరీ ఈ రేంజ్ లోనా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలకు చాలా మంచి క్రేజ్ ఉన్న తరువాత వారి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి అంటూ స్టార్ హీరోల వెంటపడుతుంది ఈ క్రమంలోనే ఈ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం కోసం సెలబ్రిటీలు కూడా కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి రామ్ చరణ్ ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సమస్త అయినటువంటి మీషో సమస్తకు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. గతంలో మీషో ఒక్కో భాషలో ఒక్కో హీరోతో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే తాజాగా మరోసారి మీషో కోసం రామ్ చరణ్ సరికొత్త యాడ్ లో నటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో కనుక చూస్తే అసలు ప్రమోషన్ వీడియో లాగా ఏమాత్రం అనిపించదు ఒక సినిమా తరహాలో ఈ యాడ్ చేశారనే చెప్పాలి. యాడ్ ప్రారంభం కాగానే.. సర్ టార్గెట్ చూశాను అంటూ చరణ్ మరో వ్యక్తికి ఫోన్ లో చెప్పగా.. ఏజెంట్ అతను ఏం వేసుకున్నాడు అంటూ అవతలి వ్యక్తి అడుగుతారు. ఇక అతడి వెనకే చెర్రీ ఫాలో అవుతూ.. బ్లూ జీన్స్ బ్లాక్ చాకెట్.. జాకెట్ ప్రీమియంగాఉంది.. సాఫ్ట్, కోజీగా ఉంది. అతడికి బాగా సూట్ అయ్యింది.. అబ్బాయి కొంచెం సెక్సీగా ఉన్నాడు సర్ అంటూ (Ram Charan) రాంచరణ్ చెబుతాడు..

అతడి జీన్స్ గురించి చెప్పమని అడగ్గానే..అతడిని పట్టుకుని ఎంతకు తీసుకున్నావ్ జాకెట్ రూ.6 వేలకా అని అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్త రూ.600 అని చెప్పగా.. ఎక్కడి నుంచి అనగానే సదరు బ్రాండ్ పేరు చెబుతాడు. దీంతో ఆ వివరాలను తెలుసుకొని వెళ్ళిపోతాడు. ఇలా మీ షో కోసం రాంచరణ్ ఈ స్థాయిలో ప్రమోట్ చేసిడం కోసం చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus