Ram Charan: చరణ్ ముంబైలో ఇల్లు కొనడానికి అదే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పాన్ ఇండియా హీరో అయిన తర్వాత పలు కార్యక్రమాలు ఈవెంట్లు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు ఒకవైపు సినిమా షూటింగ్లో మరోవైపు ఇలా ఈవెంట్ల ద్వారా ఎంతో బిజీగా మారిపోయారని తెలుస్తోంది. ఇక ఈయన కెరియర్ పరంగా ఎక్కువ భాగం ముంబైలోనే నివసిస్తూ ఉన్నారు.

ఇలా తరచు ఏదో ఒక ఈవెంట్ ద్వారా ముంబైకి వెళ్లాల్సి వస్తుంది. ఇకపోతే ఇటీవల తన భార్య కూతురుతో కలిసి దాదాపు వారం రోజులపాటు ముంబైలోనే ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ముంబైలోనే వారం రోజులు ఉన్నటువంటి చరణ్ అక్కడ ఎన్నో పనులను చక్కదిద్దుకున్నారు. ఫోర్బ్స్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనడం, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం ఇలా పలు కార్యక్రమాల ద్వారా ఈయన వారం రోజులపాటు తన భార్య కూతురితో కలిసి ముంబైలోనే ఉన్నారు

ఇలా ఎక్కువ భాగం ఆయన ముంబైకి వెళ్లాల్సి రావడంతో (Ram Charan) చరణ్ ముంబైలోనే ఒక ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయని ఇలా బాలీవుడ్ సినిమాలు చేస్తే ముంబైలోనే ఉండాల్సి వస్తుందన్న కారణంతోనే ముందుగానే అక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేయాలని భావించారట.

ఇప్పటికే హైదరాబాదులో విలాసవంతమైనటువంటి ఇంటిని కొనుగోలు చేసినటువంటి చరణ్ ప్రస్తుతం ఇక్కడే నివసిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం రూట్ మార్చబోతున్నారని ఈయన కూడా ముంబైలోనే ఒక ఇంటిని కొనుగోలు చేసి ముంబై వెళ్ళిన ప్రతిసారి హోటల్స్ లో కాకుండా ఇంట్లోనే ఉండవచ్చు అన్న భావనతోనే ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus