సగటు కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు రామ్‌చరణ్‌కు (Ram Charan) సరైన విజయాలు రావడం చాలా అరుదు. ఆయన అదే కమర్షియల్ అంశాల మధ్యలో కాస్త ప్రయోగం చేసి సినిమా చేస్తే భారీ విజయం అందుకుంటారు. దానికి ఓ ఉదాహరణ ‘రంగస్థలం’ (Rangasthalam). ఈ సినిమాకు ముందు ఆ తర్వాత ఆయన రెగ్యులర్ కమర్షియల్ సినిమావైపు వచ్చి కొన్ని పరాజయాలు అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ‘పెద్ది’ (వర్కింగ్ టైటిల్)తో (RC 16 Movie) మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత కూడా రామ్‌చరణ్ వైవిధ్యానికే ఓటు వేయాలని చూస్తున్నారు. అందుకే వెంటనే సుకుమార్ సినిమాను ఫైనల్ చేసి లైన్‌లో పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను కూడా ఆయన ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ మేరకు చరణ్ కొత్త కథలు వింటున్నారట. అలా ఇద్దరు యువ దర్శకుల కథలను దాదాపు ఓకే చెప్పారని, పూర్తి స్థాయిలో సిద్ధం చేయమన్నారు అని టాలీవుడ్ వర్గాల భోగట్టా.
గతేడాది బాలీవుడ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ‘కిల్’. ఒక రాత్రి రైలులో జరిగే మారణకాండ ఆధారంగా నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన సినిమా అది. ఈ సినిమా ఇటు వసూళ్ల పరంగానూ, అటు ప్రశంసల పరంగానూ ఆయనకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఆయన ఇటీవల రామ్‌చరణ్‌ను సినిమా కథ ఒకటి వినిపించారు అని సమాచారం. ఒక మైథలాజికల్ సబ్జెక్టుతో చరణ్‌ను ఆయన కలిశారు అని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వస్తుందంటున్నారు.
మరోవైపు ఓ యువ తెలుగు దర్శకుడు కూడా చరణ్‌ను కలిశారు అని టాక్ నడుస్తోంది. నానితో (Nani) ‘హాయ్ నాన్న’ (Hi Nanna) వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శౌర్యువ్ (Shouryuv).. రీసెంట్‌గా రామ్ చరణ్‌కు ఓ స్టోరీలైన్ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ చూఛాయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో శౌర్యువ్ ఉన్నారని చెబుతున్నారు. మరి ఈ రెండు ప్రాజెక్టులు ఉంటాయా? ఉంటే ఎప్పుడు అనేది చూడాలి.