రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ రాస్తున్న ప్రభాస్ డైరెక్టర్

  • February 4, 2020 / 03:59 PM IST

ప్రభాస్ సినీ కెరీర్ లో సాహో చిత్రం గురించి నడిచిన చర్చ అంతా ఇంతా కాదు. బాహుబలి లాంటి ఆల్ టైం హిట్ మూవీ తరువాత ఆయన చేస్తున్న భారీ యాక్షన్ మూవీ కావడంతో సాహో పై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం విడుదల తరువాత మిశ్రమ స్పందన దక్కించుకుంది. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ఈమూవీ, సౌత్ లాంగ్వేజ్ లలో పరాజయం పాలైంది. 420 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసినప్పటికీ, సినిమా బడ్జెట్ రీత్యా అధిక ధరలకు అమ్మడంతో నష్టాలు మిగిల్చింది. దీనితో దర్శకుడు సుజీత్ పై ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శలకు దిగారు. భారీ ప్రాజెక్ట్ ఆయన నాశనం చేశాడంటూ తిట్టిపోశారు.

సాహో విడుదల తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన సుజీత్ నెక్స్ట్ శర్వానంద్ తో మూవీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రన్ రాజా రన్ మూవీ విజయం సాధించిన నేపథ్యంలో వీరు మరలా కలిసి చిత్రం చేయనున్నారని తెలిసింది. ఐతే లేటెస్ట్ న్యూస్ ప్రకారం సుజీత్ హీరో రామ్ చరణ్ కొరకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. సుజీత్ చరణ్ కు ఓ స్టోరీ లైన్ వినిపించగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారట. దీనితో ఆయన కొరకు స్క్రిప్ట్ డెవలప్ చేసేపనిలో సుజీత్ ఉన్నాడని టాక్. ఒకవేళ సుజీత్ డెవలప్ చేసిన స్క్రిప్ట్ రామ్ చరణ్ కి నచ్చితే మూవీ పట్టాలెక్కే అవకాశం కలదు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ ఏడాది చివరికి గాని బయటికి రాదు. ఒక వేళ వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయినా అది 2021లో మొదలయ్యే అవకాశం ఉంటుంది.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus