Ram Charan: అఖిల్ ఫస్ట్ మూవీ అందుకే ఫ్లాపైందా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం తయారు చేసిన కథలో మరో హీరో నటించడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం తయారు చేసిన కొన్ని కథలను పవన్ రిజెక్ట్ చేయగా ఆ కథలలో రవితేజ నటించి విజయాలను అందుకున్నారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన వెలిగొండ శ్రీనివాస్ అఖిల్ ఫస్ట్ మూవీ “అఖిల్” గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చరణ్ ను దృష్టిలో ఉంచుకుని “అఖిల్” కథను రాశానని వెలిగొండ శ్రీనివాస్ తెలిపారు.

“అఖిల్” మూవీ కథ రాసే సమయానికి చరణ్ స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నారని అందువల్ల చరణ్ కు ఉన్న క్రేజ్ కు తగిన విధంగా స్క్రిప్ట్ ను సిద్ధం చేశానని వెలిగొండ శ్రీనివాస్ అన్నారు. అయితే ఆ కథలో అఖిల్ హీరోగా ఎంపికైన తరువాత కొన్ని మార్పులు చేశామని వెలిగొండ శ్రీనివాస్ వెల్లడించారు. “అఖిల్” మూవీలో అఖిల్ ను హైలెట్ చేసే విధంగా మార్పులు చేయడం వల్లే ఆ సినిమా సక్సెస్ కాలేదని భావిస్తున్నానని వెలిగొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

చరణ్ తో ఆ సినిమా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని వెలిగొండ శ్రీనివాస్ తెలిపారు. అయితే చరణ్ ఫ్యాన్స్ “అఖిల్” మూవీలో చరణ్ నటించి ఉన్నా హిట్ కాకపోవచ్చని ఆ సినిమా కథ, కథనంలో చాలా లోపాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. “అఖిల్” మూవీలో నటించనందుకు చరణ్ చాలా లక్కీ అని సోషల్ మీడియాలో చరణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus