Ram Charan: చరణ్ చేసిన పనికి ఫిదా అయినా ఫ్యాన్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా గత రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. ఇక ఈ సినిమా దాదాపు చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుందనే విషయం తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున షూటింగ్ లోకేషన్ కి చేరుకున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రామ్ చరణ్ ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో కొందరు అభిమానులు రామ్ చరణ్ కారు వెంట వెంబడించారు. ఇలా అభిమానులు తనని ఫాలో అవుతున్నారని తెలిసి రామ్ చరణ్ చాలా స్పీడ్ గా వెళ్తారని అందరూ అనుకున్నారు కానీ రామ్ చరణ్ మాత్రం తన కారును స్లో చేసి కార్ విండో గ్లాస్ డౌన్ చేసి మరి అభిమానులకు హాయ్ చెప్పారు. అంతేకాకుండా జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వారికి సూచనలు చేశారు.

ఇలా రామ్ చరణ్ అభిమానుల కోసం కారు స్లో చేయడమే కాకుండా జాగ్రత్తగా వెళ్లాలని చెబుతూ కామెంట్ చేయడంతో ఈయన రియాక్షన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఇలా ఎవరు కూడా అభిమానులతో ఇలా మార్గమధ్యంలో మాట్లాడటానికి ఇష్టపడరు కానీ రామ్ చరణ్ మాత్రం అభిమానులకు జాగ్రత్తలు చెప్పడంతో ఈయన మంచి మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) తన తదుపరి చిత్రాన్ని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో బిజీ కాబోతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus