Ram Charan: చరణ్ కు ఇష్టమైన స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) ఈ మధ్య కాలంలో అరుదైన ఘనతలను ఖాతాలో వేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ ఏడాది గేమ్ ఛేంజర్ (Game Changer)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు (Buchi Babu)  డైరెక్షన్ లో తెరకెక్కనున్న మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. తాజాగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ క్రేజీ విషయాలను చెప్పుకొచ్చారు.

Ram Charan

నాకు ఆరెంజ్ (Orange) , రంగస్థలం (Rangasthalam) సినిమాలు అంటే ఇష్టమని చరణ్ అన్నారు. మగధీర (Magadheera) నా ల్యాండ్ మార్క్ మూవీ అని ఆయన పేర్కొన్నారు. చాలామంది ఫ్యాన్స్ కు ఈ సినిమా అంటే ఇష్టమని అందుకే నేను ఈ సినిమా పేరే చెబుతానని చరణ్ పేర్కొన్నారు. యాక్షన్, రొమాంటిక్ సినిమాలలో యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని రామ్ చరణ్ తెలిపారు. నేను కామెడీ ఎప్పుడూ చేయలేదని బుచ్చిబాబుతో చేసే సినిమా ఈ జానర్ లో ఉంటుందని చరణ్ వెల్లడించారు.

Who Moved My Cheese బుక్ అంటే ఇష్టమని రామ్ చరణ్ పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తులు ఇష్టమా? వెస్ట్రన్ దుస్తులు ఇష్టమా అంటే సంప్రదాయ దుస్తులే ఇష్టమని చెబుతానని చరణ్ తెలిపారు. కోలీవుడ్ హీరో సూర్య (Suriya) నాకు ఇష్టమైన స్టార్ హీరో అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఈ తరం హీరోయిన్లలో సమంత (Samantha) అంటే ఇష్టమని రామ్ చరణ్ పేర్కొన్నారు.

చరణ్ బుచ్చిబాబు మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుందని సమాచారం అందుతోంది. 2025లో ఈ సినిమా విడుదలయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్టా. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

‘పుష్ప’ షూటింగ్ కి గడ్డం అడ్డం.. మేకర్స్ ఏం చేసారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus