రామ్‌చరణ్ గురించి ఉపాసన పెట్టే సోషల్ మీడియా పోస్టుల్లో ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది ఎప్పుడైనా గమనించారా? ఆమె ఎప్పుడూ చరణ్ అని, రామ్‌చరణ్ అని, చెర్రీ అని రాయరు. చాలావరకు ఆమె Mr.C అనే రాస్తారు. ఈ మిస్టర్ సి అంటే ఏంటో అని అభిమానులు ఎప్పుడూ ఆలోచించలేదు. కారణం ‘C’ అంటే చరణ్ అని అనుకోవడమే. అయితే Mr.C అంటే చరణ్ అని కాదని మీకు తెలుసా? ఈ విషయాన్ని రామ్‌చరణే చెప్పారు. ఉపాసన తనను Mr.C అని ఎందుకు అంటోంది చెప్పుకొచ్చాడు.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం కర్టెన్ రైజర్ కార్యక్రమానికి రామ్‌చరణ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా Mr.C గురించి చరణ్‌ను ఎన్టీఆర్ అడిగాడు. నీ గురించి రాసే ఉపాసన సోషల్ మీడియా పోస్టుల్లో చూస్తే Mr.C అని ఉంటుంది… ఏంటీ Mr.C అని అడిగాడు తారక్. దానికి చరణ్ చెప్పిన సమాధానం భలే అనిపిస్తుంది. ఎందుకంటే ‘C’ అంటే చరణ్ కాదు కాబట్టి. చరణ్, ఉపాసన ఓసారి లాస్ ఏంజిలెస్‌లోని ఓ హోటల్‌కి వెళ్లారట. దాని పేరే Mr.C.
ఆ హోటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి బోర్డు చూసి ఉపాసన అలా అనడం మొదలుపెట్టారట. అంతే మిస్టర్ సి అంటే చరణే కానీ… ఆ మాట వచ్చింది ఆ హోటల్‌ను చూసిన తర్వాత అని అర్థం. ఉపాసనకు మిస్టర్ సి ఎంతగా నచ్చింది అంటే… చరణ్‌కు ఓ సారి ఇచ్చిన గిఫ్ట్‌గా ఇచ్చిన చెప్పుల మీద కూడా మిస్టర్ సి అని రాయించి ఇచ్చారట. ఇదన్నమాట ఉపాసన ‘మిస్టర్ సి’ వెనుక ఉన్న కథ.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!