మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా చరణ్ ఓ కీలక రోల్ చేయనున్నాడు. ఇప్పటికే చాల వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే లో నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకావాల్సిఉంది. ఇక ఈ చిత్రాన్ని దసరా బరిలో దించాలని మేకర్స్ ప్లాన్స్ లో ఉన్నారు. సోషల్ కాన్సెప్ట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంన్నారు.
చిరంజీవి,చరణ్ గతంలో వెండి తెరపై కలిసి కనిపించారు కానీ, కొంత నిడివిగల పాత్ర చేయలేదు. మగధీర, బ్రూస్ లీ వంటి చరణ్ సినిమాలో చిరు క్యామియో రోల్స్ లో కనిపించి అలరించారు. కానీ ఆచార్య చిత్రంలో చరణ్ దాదాపు అరగంట నిడివి గల కీలక రోల్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంలో చిరు చరణ్ ల బంధం ఎలా ఉంటుంది. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ ఏమై ఉంటుంది అనే ఆలోచన ప్రేక్షకులలో మొదలైంది.
ఐతే ఈ మూవీలో చరణ్ రోల్ పై చిరంజీవి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే ఆచార్యలో చిరు, చరణ్ ల అనుబంధానికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. చరణ్ ఈ సినిమాలో చిరు కుమారుడిగా కనిపిస్తాడు అని అందరూ భావించినా అది నిజం కాదట. చిరు-చరణ్ లది ఆచార్యలో గురు శిష్యుల బంధం అని ఆయన తెలిపారు.దీనితో ఆచార్యలో చరణ్ రోల్ పై ఓ స్పష్టత వచ్చినట్లైంది. గతంలో ఈ పాత్ర మహేష్ చేస్తున్నారని ప్రచారం జరుగగా, అది కూడా నిజం కాదని చిరు చెప్పుకొచ్చారు.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!