‘మగథీర’ ‘ఆరెంజ్’ సినిమాల తరువాత చరణ్ నటించిన సినిమాలు కమర్షియల్ గా ఓకే అనిపించాయి. కానీ ఆయన నటన పై మాత్రం చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అదే టైములో ‘బ్రూస్ లీ’ వంటి చిత్రం కూడా నిరాశపరచడంతో అవి మరింతగా పెరిగాయనే చెప్పాలి. అయితే అటు తరువాత వచ్చిన ‘ధృవ’ చిత్రం ఓ కొత్త చరణ్ ను పరిచయం చేసిందని చెప్పొచ్చు. స్టైలిష్ కాప్ గా ఆ చిత్రంలో చరణ్ జీవించాడు.
నిజానికి ‘ధృవ’ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తనీ ఒరువన్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అక్కడ మోహన్ రాజా డైరెక్ట్ చెయ్యగా.. ఇక్కడ సురేందర్ రెడ్డి దానిని రీమేక్ చేసాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్లాన్ చేసాడట దర్శకుడు మోహన్ రాజా. బైలింగ్యువల్ మూవీగా ఈ ప్రాజెక్టుని ఏక కాలంలో తెరకెక్కించాలని ప్లాన్ చేసాడట ఈ దర్శకుడు. అందుకు గాను… ఈ మధ్యనే చరణ్ ను కలిసి కథ కూడా వినిపించాడట. చెప్పాలంటే చరణ్ కు కూడా ఆ కథ నచ్చింది.
‘చూద్దాం అండి’ అని చెప్పాడట. అయితే ఇటీవల మోహన్ రాజా మళ్ళీ చరణ్ కు కాల్ చేసి అడుగగా.. ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ మరియు ‘ఆచార్య’ చిత్రాలు పూర్తయ్యేంత వరకూ మరో సినిమాకి ఓకే చెప్పలేను’ అని చెప్పాడట.దాంతో… ‘ బహుశా చరణ్ కు ‘ధృవ’ సీక్వెల్ ను కూడా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చెయ్యాలని ఆశ ఉందేమో’ అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?