RC15: శంకర్‌ – చరణ్ సినిమా కొత్త షెడ్యూల్‌ స్టార్ట్!

ప్రముఖ దర్శకుడు శంకర్‌ రెండు పడవల ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు రామ్‌చరణ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే.. ఎప్పుడో ఆగిపోయిన ‘ఇండియన్‌ 2’ సినిమా రీస్టార్ట్‌ చేశారు. కొన్ని రోజులు ఆ సినిమా పనులు చేసిన శంకర్‌.. ఇప్పుడు మళ్లీ రామ్‌చరణ్‌ సినిమా సంగతికొచ్చారట. చరణ్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలైందట. గతంలో షూటింగ్‌ జరిగిన ప్రాంతంలోనే ఇప్పుడూ షూటింగ్‌ చేస్తున్నారట. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో, దిల్‌ రాజు నిర్మాణంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జె.సూర్య, నవీన్‌ చంద్ర ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను సోమవారం రాజమహేంద్రవరంలో మొదలుపెట్టారు. వారం రోజులపాటు సాగే చిన్న షెడ్యూల్‌ ఇదట. కొత్త షెడ్యూల్‌లో భాగంగా రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం రామ్‌చరణ్‌ కొంత మేకోవర్‌ కూడా చేసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని లుక్స్‌, ఫొటోలు బయటకు వచ్చాయి.

ఓపెన్‌ ఏరియాలో షూట్‌ చేయడం వల్ల అవి బయటకు వచ్చాయి. అయితే ఈ లీకుల విషయంలో శంకర్‌ ఆగ్రహంగా ఉన్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్స్‌ అన్నీ.. ఇండోర్‌ సెట్స్‌లో ఉండొచ్చు అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మళ్లీ రాజమహేంద్రవరం వెళ్లారు. మరి కొత్త లుక్‌లు, ఫొటోలు ఏమన్నా బయటకు వస్తాయేమో చూడాలి. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది.

తమన్‌ స్వరాలందిస్తున్న ఈ సినిమాకు తిరు, రత్నవేలు ఛాయాగ్రాహకులు. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుదాం అనుకున్నారు. కానీ అప్పటికి షూటింగ్‌ అవ్వదని వెనక్కి తగ్గి ‘వారసుడు’కి దారి ఇచ్చారు. ఆ తర్వాత సమ్మర్‌ సీజన్‌ అన్నారు. అయితే శంకర్‌ రెండు సినిమాల ప్రయాణం కారణంగా ఆ సీజన్‌ కూడా డౌటే అంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus