Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గా మెగా పవర్ స్టార్ స్టైలిష్ లుక్..!

  • March 27, 2023 / 04:41 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ కియారా అద్వానీ జంటగా.. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీకి ‘గేమ్ ఛేంజర్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.. ఇది చరణ్ 15వ సినిమా కాగా దిల్ రాజుకి 50వ సినిమా..

హెవీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో.. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఖర్చు పెరుగుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నారు.. ఇటీవలే ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఓ సాంగ్ షూట్ చేశారు.. రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండగా.. (పొలిటికల్ లీడర్ – ఎలక్షన్ ఆఫీసర్ అని సమాచారం).. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు..

రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఉదయం (Game Changer) టైటిల్ ట్రీట్ ఇచ్చిన టీమ్.. మధ్యాహ్నం మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది.. మెగా పవర్ స్టార్ స్టైలిష్ లుక్ రిలీజ్ చేశారు.. ఇప్పటివరకు చరణ్ సూట్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.. ఈ పోస్టర్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్, గాగుల్స్‌తో బైక్ మీద కూర్చుని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది.. పాన్ ఇండియా స్థాయిలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి..

ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయిందట.. RRR వచ్చిన గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కి తగ్గకుండా ప్రపంచ సినీ ప్రియులను, మెగాభిమానులను అలరించే విధంగా.. శంకర్ మార్క్ కథ, కథనాలతో, అదిరిపోయే పాటలతో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో.. టాప్ టెక్నీషియన్లతో వండర్ ఫుల్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు.. ‘గేమ్ ఛేంజర్’ నుండి విడుదల చేసిన రామ్ చరణ్ పోస్టర్‌ని, టైటిల్ వీడియోని షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సినీ వర్గాల వారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus