Ram Charan: లోకేశ్ కనగరాజ్ సినిమాలో చరణ్ రోల్ ఇదేనా?

చరణ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకోవడంతో పాటు స్టార్ హీరోలకు ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయారు. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తర్వాత మూవీ పేరు లియో అనే సంగతి తెలిసిందే. తాజాగా లియో టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

టీజర్ చివరి షాట్ లో తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న ఖరీదైన కారు కనిపిస్తుంది. ఆ కారులో రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లియో మూవీ క్లైమాక్స్ లో చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో పేరు మోసిన గ్యాంగ్ స్టర్స్ లో ఒకరుగా కనిపిస్తారని తెలుస్తోంది. చరణ్ నటిస్తే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.

ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో విజయ్ కోరుకున్న హిట్ దక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ సైతం వరుస సక్సెస్ లతో మార్కెట్ ను పెంచుకుంటున్నారు. విజయ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. సినిమా సినిమాకు విజయ్ మార్కెట్ పెరుగుతుండగా ప్రాజెక్ట్ ల ఎంపికలో విజయ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

లియో కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో చూడాల్సి ఉంది. విజయ్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మల్టీస్టారర్స్ లో నటిస్తే విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. విజయ్ సైతం టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus