స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తైంది. ఈ సినిమా పూర్తైన వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా షూట్ లో చరణ్ పాల్గొననున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్ లో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే చరణ్ నికర ఆస్తులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ నికర ఆస్తుల విలువ 1370 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
చరణ్ పారితోషికం పరిమితంగానే ఉన్నా వేర్వేరు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా చరణ్ ఆస్తుల విలువ పెరిగిందని తెలుస్తోంది. ప్రముఖ కంపెనీల ఉత్పత్తులకు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచి మంచి లాభాలను అందించాయి. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
17 సంవత్సరాల సినీ కెరీర్ లో రామ్ చరణ్ కేవలం 14 సినిమాలలో మాత్రమే నటించారు. గేమ్ ఛేంజర్ సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న చరణ్ బుచ్చిబాబు సినిమాకు మాత్రం ఒకింత భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు సైతం సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రామ్ చరణ్ (Ram Charan) మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలలో సైతం నటించాలని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమా సినిమాకు రామ్ చరణ్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండగా చరణ్ భవిష్యత్తు సినిమాలు ఇతర భాషల్లో ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సైతం చరణ్ ఆసక్తి చూపిస్తున్నారు. చరణ్ ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!