Manoj: సర్ప్రైజ్ గిఫ్ట్ ఇలా అద్భుతంగా ఉంటాయి!

మంచు మనోజ్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా భూమా మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉన్నారని,త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు అనుగుణంగానే మార్చి మూడవ తేదీ మనోజ్ మౌనిక మంచు లక్ష్మి ప్రసన్న నివాసంలో అది కొద్దిమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ విధంగా ఈ జంట వివాహం చేసుకున్న అనంతరం పలు దైవ దర్శనాలకు వెళ్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

అయితే తాజాగా మనోజ్ (Manoj) తన పెళ్లిలో వచ్చిన కానుకలకు గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే తన పెళ్లికి ఉపాసన రాంచరణ్ దంపతులు హాజరు కాలేకపోయినా తనకు మాత్రం సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసన పంపిన గిఫ్ట్ కు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇలా అద్భుతంగా ఉంటాయి.

థాంక్యూ చరణ్ ఉపాసన. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురుచూస్తున్నాను. మాల్దీవ్స్ ట్రిప్ నుంచి రాగానే మిమ్మల్ని కలుస్తాను. ప్రేమతో ఎం అండ్ ఎం అంటూ మనోజ్ ఉపాసన రాంచరణ్ తన పెళ్లి కోసం గిఫ్ట్ పంపించిన విషయాన్ని మనోజ్ తెలియచేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

అయితే ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో ఉండటం వల్ల ఈయనకు కాస్త విరామం దొరకడంతో తన భార్యతో కలిసి పలు ప్రదేశాలకు వెళ్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ప్రస్తుతం ఉపాసన కూడా ప్రెగ్నెంట్ కావడంతో రామ్ చరణ్ తన పక్కనే ఉంటూ తనని విదేశీ పర్యటనలకు తీసుకెళ్తూ సంతోషంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus