Ram Charan, Balakrishna: ‘అన్‌స్టాపబుల్‌ 3’ గెస్ట్‌ల లిస్ట్‌ అప్పుడే రెడీనా?

‘అన్‌స్టాపబుల్‌’.. ‘అన్‌స్టాపబుల్‌ 2’ మీకు ఏది నచ్చింది అంటే తొలి సీజన్‌కే ఓటేస్తారు ప్రేక్షకులు. రెండో సీజన్‌లో సమ్‌థింగ్‌ మిస్సింగ్‌ అనే ఫీల్‌ రావడమే దీనికి కారణం. అయితే ఆఖరి మూడు ఎపిసోడ్‌లతో తిరిగి పునర్‌ వైభవం సంపాదిద్దాం అనుకుంటోంది ఆహా టీమ్‌. ఆ విషయం పక్కనపెడితే.. మూడో సీజన్‌ గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది. దీనికి కారణం కూడా ప్రభాస్‌ ఎపిసోడే. ఆ ఎపిసోడ్‌ చూసినవాళ్లకు ‘అన్‌స్టాపబుల్‌ 3’లో ఓ గెస్ట్‌ ఎవరు అనేది తెలిసిపోతుంది కాబట్టి.

ఒకవేళ మీరు ఇప్పటికే ఎపిసోడ్‌ చూసుంటే ఆ గెస్ట్‌ ఎవరు అనేది ఈజీగానే చెప్పేస్తారు. లేదంటే మేమే చెబుతున్నాం. అతనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. అవును మూడో సీజన్‌లో చరణ్‌ ఓ గెస్ట్‌ అవుతున్నాడు. ప్రభాస్‌ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ ఫోన్‌ కాల్‌ సెగ్మంట్‌ కూడా నడిచింది. అందులో భాగంగా రామ్‌చరణ్‌తో బాలయ్య మాట్లాడుతూ.. ‘నువ్వు ఎప్పుడు వస్తున్నావ్‌ అన్‌స్టాపబుల్‌కి’ అని అడిగేశాడు బాలయ్య. దానికి రామ్‌చరణ్‌ ఎంతో గౌరవంగా ‘మీరు ఎప్పుడు కాల్‌ చేసి రమ్మంటే అప్పుడు రెడీ’ అని క్లారిటీ ఇచ్చేశాడు.

దీంతో మూడో సీజన్‌ కోసం బాలయ్య ఇప్పటి నుండే గెస్ట్‌ల ఎంపిక మొదలుపెట్టాడు అని అంటున్నారు. రెండో సీజన్‌ తొలి ఎపిసోడ్లలోనే ఫైనల్‌ ఎపిసోడ్‌ గెస్ట్‌ను ఫిక్స్‌ చేశాడు బాలయ్య. శర్వానంద్‌ – అడివి శేష్‌ ఎపిసోడ్‌లో త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ‘ఎవరితో రావాలో తెలుసుగా’ అంటూ పవన్‌ను రమ్మని చెప్పేశాడు. అన్నట్లుగానే ఇటీవల పవన్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ కూడా జరిగిపోయంది. అలా మూడో సీజన్‌ లెక్కలు కూడా అప్పుడే స్టార్ట్‌ చేశాడు బాలయ్య.

రెండో సీజన్‌లో మిస్‌ అయిన ‘స్టార్‌’ ఎలిమెంట్‌ను మూడో సీజన్‌లో ఫుల్‌గా కవర్‌ చేయాలని టీమ్‌ అనుకుంటున్నారని బాలయ్య ఆలోచనల్లో అర్థమైపోతోంది. అయితే చరణ్‌తోపాటు మరికొంతమంది స్టార్‌ హీరోలతో మూడో సీజన్‌ను ఫుల్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారట అల్లు అరవింద్‌. దీని కోసం సౌత్‌ ఇండస్ట్రీతోపాటు, నార్త్‌ ఇండస్ట్రీ నుండి కూడా స్టార్లను తీసుకొచ్చే ఆలోచన ఉందని సమాచారం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus