Game Changer: శంకర్ మళ్ళీ మొదలెట్టాడు.. చరణ్ ఒప్పుకుంటాడా?

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాంచరణ్ (Ram Charan) ‘ఆచార్య’ (Acharya) ‘కిసీ క భాయ్ కిసీ క జాన్'(హిందీ) (Kisi Ka Bhai Kisi Ki Jaan) వంటి సినిమాల్లో కేమియోలు ఇచ్చాడు. అవి దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే వాటి రిజల్ట్స్ చరణ్ అకౌంట్లో వేయడానికి లేదు. కానీ అతను ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)   తో గట్టిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చరణ్ గ్లోబల్ స్టార్. అతనికి విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకునే చరణ్..

Game Changer

తన నెక్స్ట్ సినిమాని శంకర్   (Shankar)   దర్శకత్వంలో చేయడానికి కమిట్ అయ్యాడు. 2021 నుండి అంటే దాదాపు 3 ఏళ్లపాటు ‘గేమ్ ఛేంజర్’  (Game Changer)ప్రాజెక్టుకే అంకితమైపోయాడు చరణ్. జూలై నెల ఆరంభంలో అతని పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ విషయాన్ని శంకర్ నేరుగా మీడియాతో చెప్పడం జరిగింది. కానీ రషెస్ చూసుకున్న తర్వాత శంకర్.. మళ్ళీ కొంత ప్యాచ్ వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడట. దీంతో మరో 4,5 రోజులు చరణ్ డేట్స్ కావాలని అతను నిర్మాత దిల్ రాజుని  (Dil Raju)   అడిగాడట.

అయితే చరణ్ ఆల్రెడీ బుచ్చిబాబు (Buchi Babu)  సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు. ఇలాంటి టైంలో డేట్స్ అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం. నిర్మాత దిల్ రాజుకు కూడా అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే చేసేదేమీ లేదు. అతను చరణ్ ని బ్రతిమాలాల్సిందే. షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉండగా ఆ ఒక్క స్టెప్ తీసుకోకపోతే.. ప్రాజెక్టు బయటకు రాదు. కాకపోతే మేకోవర్ విషయంలో చరణ్ ఎలా మేనేజ్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

ఘనంగా కిరణ్ అబ్బవరం , రహస్యల పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus