Kiran Abbavaram, Rahasya’s Wedding Photos: ఘనంగా కిరణ్ అబ్బవరం , రహస్యల పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

ఈ ఏడాది చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), మీరా చోప్రా (Meera Chopra). , అపర్ణ దాస్ .. వారితో పాటుఅర్జున్ (Arjun Sarja)  కూతురు ఐశ్వర్య (Aishwarya Arjun) .. వంటి వారు ఉన్నారు. తాజాగా మరో హీరో, హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Kiran Abbavaram, Rahasya’s Wedding Photos

వివరాల్లోకి వెళితే. రాజా వారు రాణి గారు (Raja Vaaru Rani Gaaru)  అంటూ తెరపైకి పరిచయమైన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)  రహస్య గోరక్ లు (Rahasya Gorak)   ఇప్పుడు నిజ జీవితంలోనూ వివాహ బంధంతో ఒకటయ్యారు. దాదాపు ఐదేళ్లు పాటు రహస్య ప్రేమాయణం సాగించిన ఈ జంట వివాహ బంధంతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు.

కర్ణాటకలోని కూర్గ్ లో ఓ రిసార్ట్ లో కిరణ్ అబ్బవరం, రహస్యల వివాహం గురువారం (ఆగస్ట్ 22న అర్దరాత్రి) వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్దతుల్లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహంకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus