Game Changer: ‘రా మచ్చా’.. మనవాళ్లు వదిలేశారు.. విదేశీయులు వైరల్‌ చేస్తున్నారు!

ప్రముఖ కథానాయకుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) – ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  . ఈ సినిమాకు ఉన్న బజ్‌ ఇటీవల కాలంలో ఏ సినిమాకూ రాలేదు. అయితే సినిమా టీమ్‌ అనుకున్న సమయానికి రిలీజ్‌ అవ్వడం లేదు. వాయిదాలు పడుతూ పడుతూ ఇప్పుడు సంక్రాంతి సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ‘రా మచ్చా’ అంటూ ఓ సాంగ్‌ రిలీజ్‌ అయింది. తొలుత మిక్స్‌డ్‌ టాక్‌ అందుకున్న ఈ పాట.. తర్వాత తర్వాత వైరల్‌ అవుతోంది.

Game Changer

అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వైరల్ అయిన పాటల్లో ఈ పాట తక్కువగా వినిపించింది. కానీ విదేశాల్లో ‘రా మచ్చా’ సాంగ్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియాలో అక్కడి పాప్‌ స్టార్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సెర్లు పాటకు స్టెప్పులేసి, ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. దీంతో మన దగ్గర వదిలేసినా.. గ్లోబల్‌ స్టార్‌కి గ్లోబల్‌ లెవల్‌లో అప్రిషియేషన్‌ వస్తోంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘గేమ్ ఛేంజర్’ సినిమా నుండి తొలుత ‘జరగండి జరగండి..’ అనే పాట వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన పాటకు మంచి స్పందనే వచ్చింది. అయితే ఓ మంచి స్టెప్‌ లిరికల్‌ సాంగ్‌లో రిలీజ్‌ చేయలేదని.. థియేటర్‌ వెర్షన్‌లో ఉంటుందని సంగీత దర్శకుడు తమన్‌ చెప్పి పాట మీద హైప్‌ పెంచాడు. ఇప్పుడు ‘రా మచ్చా..’ సాంగ్‌ కూడా అంతే. ఇందులో వీణ స్టెప్‌ ఉంది. అయితే అనుకున్నంతగా బీట్‌ లేకపోవడం.. చూపించిన ఒక్క హుక్‌స్టెప్‌ అంత అట్రాక్టివ్‌గా లేకపోవడం మన వాళ్లకు నచ్చలేదు.

అయితే ఉన్న స్టెప్పులు జపాన్‌, దక్షిణ కొరియాలో నచ్చుతున్నట్లు ఉన్నాయి. తన డ్యాన్స్‌ వీడియోను మిన్ జున్ అనే సోషల్‌ మీడియా సెలబ్రిటీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేశాడు. పార్క్ మిన్ జున్ దక్షిణ కొరియాకు చెందిన పాప్ సింగర్, మ్యూజిక్‌ కంపోజర్.

కల్కి డైరెక్టర్.. మిడిల్ క్లాస్ కారు చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus