పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) భారీ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన టాలెంట్ ను మరోసారి ప్రపంచం గుర్తించింది. చిన్నప్పటి నుంచి మీడియా, రచనల మీద ఆసక్తి ఉన్న నాగ్ అశ్విన్, కెరీర్ ప్రారంభంలో శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. దర్శకుడిగా మొదటి అడుగులు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో (Yevade Subramanyam) వేయగా, ఆ తర్వాత ‘మహానటి’తో (Mahanati) భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
‘మహానటి’ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’తో టాలెంట్ ప్రూవ్ చేసిన నాగ్, రూ.1200 కోట్ల వసూళ్లను అందుకున్నారు. ఇంతటి సక్సెస్ వచ్చినా కూడా ఆయన సింప్లిసిటీకి మాత్రం ఏమాత్రం తేడా రాలేదు. ఎప్పుడూ సింపుల్ డ్రెస్ లో కనిపించే నాగ్ అశ్విన్, లగ్జరీతో సంబంధం లేకుండా ఉంటారు. తాజాగా ఆయన వాడుతున్న మహీంద్రా e2o ఎలక్ట్రిక్ కారు గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. మహానటి, జాతిరత్నాలు (Jathi Ratnalu) , కల్కి సినిమాలకు వెళ్లడప్పుడు అదే కారు వాడానని, ఇంటి పైనున్న సోలార్ ప్యానెల్స్ ద్వారా ఛార్జ్ చేసేవాడినని చెప్పారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నాగ్ అశ్విన్ సింప్లిసిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రూ.1200 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ ఇంత సింపుల్ గా ఒక మిడిల్ క్లాస్ తరహాలో ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. కల్కి సినిమాకు అతనికి రెమ్యునరేషన్ 70 కోట్ల రేంజ్ లోనే వచ్చి వుంటుంది.
ఇక సొంత మామయ్య అశ్వినీ దత్ (C. Aswani Dutt) తోనే సినిమా కాబట్టి లాభాల్లో వాటా కూడా ఇచ్చి ఉంటారని టాక్ ఉంది. ఇక అలాంటి అల్లుడికి అశ్వినిదత్ అనుకుంటే లగ్జరీ కార్లు ఇవ్వగలరు. కానీ నాగ్ అశ్విన్ తన ఇష్టమైన లైఫ్ లో సాదా సీదా కారును ఎంచుకున్న ఆయన తీరు గ్రేట్ అని అంటున్నారు.