Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ ఏంటో..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan)  హీరోగా ‘పెద్ది’ (Peddi) సినిమా తెరకెక్కుతుంది. ‘ఉప్పెన’ (Uppena) తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ చిత్రానికి దర్శకుడు. ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar) కూడా నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చరణ్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar)  కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Peddi

ఆల్రెడీ శివరాజ్ కుమార్ కు సంబంధించి 2 రోజులు షూటింగ్ జరిపారు. మొదటిసారి తెలుగులో ఆయన డైలాగులు చెప్పుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ‘పెద్ది’ కి సంబంధించి 2 కీలక షెడ్యూల్స్ ను ఫినిష్ చేశారు. త్వరలో 3వ షెడ్యూల్ కూడా మొదలవుతుంది అని సమాచారం. ఈ షెడ్యూల్ ను లండన్ లో నిర్వహించబోతున్నట్లు టాక్ నడుస్తుంది.

అయితే ఇది పీరియాడిక్ మూవీ అని ప్రాజెక్టు స్టార్టింగ్లో చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు లండన్ కి వెళ్లి చిత్రీకరించేది ఏముంటుంది? అనే చర్చలు కూడా ఓ పక్కన జరుగుతున్నాయి. అయితే బుచ్చిబాబు ప్లానింగ్ ఎలా ఉందో ఆయనకే తెలియాలి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘పెద్ది’ (Peddi) సినిమాలో రాంచరణ్ ఆట కూలీగా కనిపించబోతున్నారు. క్రికెటర్ గానే కాకుండా కుస్తీ ఫైటర్ గా, కబడ్డీ ప్లేయర్ గా కూడా చరణ్ కనిపిస్తాడని టాక్.

SSMB29 : హీరోయిన్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus