కొత్త రికార్డ్ సృష్టించిన వినయ విధేయ రామ టీజర్!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్, కైరా అద్వానీ జంటగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘వినయ విధేయ రామ’. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా అనూహ్య స్పందన వస్తుంది. ఈ మాస్ కాంబో కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అన్ని పూర్తి చేసుకొని ఈ సినిమాని సంక్రాంతి బరిలోకి దింపనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక బోయపాటి తనదైన శైలి యాక్షన్, రామ్ చరణ్ పవర్ ఫుల్ డైలాగ్స్, దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తూ వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ రిలీజ్ అయినా ఒక గంటలోనే 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా 24 గంటల్లో 15.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని రాబట్టింది. అయితే తెలుగులో ఈ రేంజ్ లో ఒక్క రోజులోనే ఇన్ని వ్యూస్ రాబట్టిన మొదటి సినిమా ఇదేనని చెబుతున్నారు. మరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ తోనే ఇలాంటి రికార్డ్స్ సృష్టిస్తే సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus