‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సెన్సారే కష్టమట.. ఇక రిలీజ్ సంగతేంటి?

  • November 11, 2019 / 06:51 AM IST

ఇది వరకు తన సినిమాల్లో క్రియేటివిటీ మరియు మేకింగ్ తో అలరించిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు కేవలం పబ్లిసిటీ కోసమే అన్నట్టు సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. అదికూడా అయిపోయిందేమో ఇప్పుడు కేవలం ఆడియన్స్ మీద రివెంజ్ అనే పందాకి వచేసినట్టున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా తీసి టీడీపీ నాయకులని అలాగే నారా, నందమూరి కుటుంబ సభ్యులకి నిద్ర లేకుండా చేసిన వర్మ కొన్ని థియేటర్లు మూత పాడటానికి కూడా కారణమయ్యాడు. ఆ చిత్రం పై చాలా కేసులు కూడా పడ్డాయి. ఎన్నికల సమయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాలేదు. ఎన్నికలు అయిపోయి.. ఫలితాలు వెల్లడించాక అక్కడ విడుదలకు పెర్మిషన్ ఇచ్చారు.

ఆ సినిమాకి అంత రచ్చ జరిగాక కూడా వర్మ మారలేదు. ఇప్పుడు ఏకంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ సినిమా తీసేసి ట్రైలర్ కూడా విడుదల చేసేసాడు. నవంబర్ 28న విడుదల అంటూ డేట్ కూడా అనౌన్స్ చేసేసాడు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దెబ్బకు థియేటర్లు మూత పడటంతో ఈసారి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా కొనుక్కోవడానికి బయ్యర్స్ ముందుకు రావడం లేదట. కేసులు, కోర్టులు వరకూ వెళ్ళినా వర్మకి సహాయం చేసేవాళ్ళు కూడా లేరట. కనీసం ఈ చిత్రానికి సెన్సార్ అవుతుందా అనేది కూడా పెద్ద ప్రశ్నే అని చెప్పాలి. దీంతో వర్మకి టెన్షన్ మొదలైందని.. ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!


తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus