RGV,Kantara: రిషబ్ శెట్టికి సినిమా ఇండస్ట్రీ ట్యూషన్ ఫీజు చెల్లించాలి.. ఆర్జీవీ కామెంట్స్ వైరల్..

  • October 19, 2022 / 01:05 PM IST

సినిమా, పాలిటిక్స్.. గల్లీ నుండి ఢిల్లీ వరకు దేని గురించి అయినా.. నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వరకు తనకు సంబంధం లేని ఏ విషయం గురించైనా తను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు ట్వీట్ ద్వారా చెప్పడం కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మకు వోడ్కాతో పెట్టిన విద్య.. ఎప్పుడూ అప్ డేట్ గా ఉండే వర్మ చూపు ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార’ మీద పడింది. కన్నడ యంగ్ హీరో,

టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘కాంతార’ వరల్డ్ వైడ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం.. సోమవారం, మంగళవారం లాంటి వీక్ స్టార్టింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోని ఓ ప్రాంతానికి చెందిన సంస్కృతీ, సాంప్రదాయాలకు పెద్ద పీటవేస్తూ రిషబ్ తెరకెక్కించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

సినిమా చూసి పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు. రీసెంట్ గా ఆర్జీవీ కూడా ‘కాంతార’ గురించి రివ్యూ చెప్తూ.. సినిమా ఇండస్ట్రీ మీద తన స్టైల్లో సెటైర్స్ వేసాడు. ‘‘చిన్న సినిమాగా విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండా భారీ బడ్జెట్ సినిమాల రికార్డులను బీట్ చేసిందీ మూవీ.. అలాగే భారీ బడ్జెట్ సినిమాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయనే అపోహను కూడా రిషబ్ బద్దలు కొట్టాడు.. తనలోని సింప్లిసిటీ కారణంగానే ఇలాంటి గ్రేట్ ఫిల్మ్ బయటకు వచ్చింది..

రాబోయే తరాలకు ‘కాంతార’ ఓ పాఠం.. భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు తీసే వాళ్లకి ఈ సినిమా ఓ పీడకల.. 300, 400, 500ల కోట్ల రూపాయలతో పెద్ద సినిమాలు తీసే వాళ్లకి ‘కాంతార’ కలెక్షన్లు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాయి’’.. అంటూ ట్వీట్ చేసాడు.. ‘‘కాంతార’ లాంటి అద్భుతమైన పాఠాన్ని అందరికీ అందించినందుకు థ్యాంక్స్.. సినిమా ఇండస్ట్రీలోని వారంతా మీకు ట్యూషన్ ఫీజు చెల్లించాలి’’ అంటూ ‘కాంతార’ మూవీకి, రిషబ్ శెట్టికి తన వంతు ప్రమోషన్ కల్పించాడు ఆర్జీవీ.. ఇప్పుడాయన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus