Pawan Kalyan: పవన్ ను పొగడ్తల తో ముంచేసిన రాంగోపాల్ వర్మ…8వ వింత అంటున్న నెటిజన్లు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇవాళ పవర్ స్టార్ బర్త్ డే కావడంతో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు భారీగా పెంచగా, తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

హంగ్రీ చీతా అంటూ గ్లింప్స్ కు ఓ రేంజిలో హైప్ ఇచ్చిన చిత్రబృందం.. అంచనాలకు మించి అదిరిపోయేలా ఉన్న ఈ గ్లింప్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక పవర్ స్టార్ ‘ఓజీ’ గ్లింప్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల్లో ఇదే బెస్ట్ ట్రైలర్ అంటూ మెచ్చుకున్నారు. “ఇది పవన్ కల్యాణ్ కు (Pawan Kalyan) నిజమైన హ్యాపీయెస్ట్ బర్త్ డే.

‘ఓజీ’ గ్లింప్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల్లోకెల్లా ఇదే బెస్ట్ ట్రైలర్ అని నేను భావిస్తున్నాను. సుజీత్ చంపేశావ్” అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అందాల తార ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటుడు అర్జున్ దాస్, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రముఖ నటి శ్రీయ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus