రజనీకాంత్ పై సంచలన కామెంట్స్ చేసిన వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు నచ్చినట్టు బతకడమే కాదు.. తోచినట్టు సినిమాలు తీస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనిపించింది రాస్తుంటారు. దీంతో కొంతకాలంగా నిత్యం వార్తల్లో ఉన్న వర్మ తాజాగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పై కామెంట్ చేసి బ్రేకింగ్ న్యూస్ లో నిలిచారు. రజినీ కాంత్ ప్రస్తుతం నటిస్తున్న 2.o సినిమాని, రాజకీయరంగ ప్రవేశాన్ని కలిసి ట్విట్టర్ లో తనదైనశైలిలో ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాల్లో భారత్‌ కూడా ఒక దేశం. అదే రజనీకాంత్‌ ప్రధానమంత్రి అయితే ఇండియా కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుంది. 2.జీరో నుంచి 200.జీరోకు చేరుతుంది’’ అని పోస్ట్ చేశారు. ఇది రజినీ కాంత్ పై వర్మకి ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని ప్రతిభింబిస్తోంది. ఇంతటితో వర్మ ఆగలేదు.

తాను ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శివ సినిమాతో నాగార్జున నాకు కిక్ స్టార్ట్ ఇచ్చాడు. ఇన్నేళ్ల తరువాత నాకు మరో కిక్ కావాలి. ఈ చిత్రం రిలీజ్ డేట్, టైము త్వరలోనే ప్రకటిస్తాను.” అని అన్నారు. అలాగే నాగార్జున ఫ్యాన్స్ గురించి తమాషాగా మాట్లాడారు. “నాగార్జునతో హిట్ కొట్టకపోతే ఆయన ఫ్యాన్స్ నన్ను తన్నేందుకు సిద్ధంగా ఉన్నారు. సినిమాలో విలన్స్ కోసం నువ్వు(నాగార్జున) కిక్స్ రెడీ చెయ్యి, నన్ను తన్నేందుకు నీ ఫ్యాన్స్ కిక్స్ ను రెడీగా ఉంచమను’’ అంటూ ట్వీట్ చేశారు. నిన్న, మొన్న చేసిన ఈ ట్వీట్స్ లో విమర్శలు లేకపోవడంతో రజినీ అభిమానులు, నాగ్ ఫ్యాన్స్ వర్మ ట్వీట్స్ ని సరదాగానే తీసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus