RGV Dance: కూతురు వయసున్న అమ్మాయితో బర్త్ డే రొమాన్స్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజంగా ఏమి చేసినా అది ఒకరకంగా సంచలనంగానే ఉంటుంది. తనకు నచ్చిన విధంగా సినిమాలు తీస్తానని, ఎవరికి ఇష్టమైతే వారు చూస్తారు, నచ్చని వాళ్లు చూడవలసిన అవసరం లేదు అంటూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వర్మ, ఇటీవల కెరీర్ పరంగా తెలుగులో తీస్తున్న సినిమాలతో ఆశించిన స్థాయి సక్సెస్ లు అయితే అందుకోలేకపోతున్నారు. కొద్దిరోజుల క్రితం బిగ్ బాస్ నటి అరియనా గ్లోరీ తో కలిసి తన జిమ్ లో మంచి రొమాంటిక్ వీడియో తీసి పోస్ట్ చేసిన వర్మ,

నేడు ఏకంగా తన కూతురు వయసున్న అమ్మాయి పుట్టినరోజు వేడుకల్లో ఒకింత రెచ్చిపోయారు అనే చెప్పాలి. టాలీవుడ్ కి చెందిన ఒక వర్ధమాన నటి పుట్టినరోజు సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా హాజరై ఆమెకు కేక్ తినిపించడం, ఆపై ఆమెను హగ్ చేసుకుని ముద్దాడడం వంటివి చేసారు. ఈ కార్యక్రమంలో వర్మ తో పాటు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, నటి జ్యోతి కూడా ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తుండడం,

ఆ సమయంలో ఆమె కేక్ కట్ చేయడంతో ఒకింత మంచి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిన వర్మ, అక్కడున్న వారందరితో ప్రవర్తించిన తీరు మనకి ఆశ్చర్యాన్ని గురిచేయక మానదు. అయితే ఆ సమయంలో ఆయన వోడ్కా తాగి ఉన్నారని, అందుకే అలా ప్రవర్తించారని సమాచారం. మొత్తంగా వర్మ చేసిన ఈ హాట్ రొమాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు ఆయనని తప్పుపడుతూ నువ్వు రామ్ గోపాల్ వర్మవి కాదు కామ గోపాల్ వర్మవి అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus