Ram Gopal Varma: సోషల్‌ మీడియాలో స్టార్‌ అయిపోతున్న ఆ ఇన్‌స్టా బ్యూటీ… అయితే!

రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా గురి తప్పొచ్చు కానీ… వర్మ తీసుకొచ్చే అందం, వర్మ ఏరి కనిపెట్టే అందం ఎప్పటికీ గురి తప్పదు. ఎక్కడి నుండి ఎలా పట్టుకొస్తారో కానీ ఆయన సినిమాల్లో నాయికలు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు భలే కుదిరిపోతారు. అలాంటి దర్శకుడు ఓ అమ్మాయిని సోషల్‌ మీడియాలో చూసి ఇష్టపడ్డారు అంటే ఎంత అదిరిపోయే అందం అయి ఉండాలి చెప్పండి. ఇటీవల ఆయన అలా ఓ చిన్న వీడియో క్లిప్‌ను షేర్‌ చేసి ఓ అమ్మాయి గురించి ఆరా తీశారు. కట్‌ చేస్తే ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయింది.

శ్రీ లక్ష్మీ సతీష్… పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పేరు ఓ ప్రభంజనం. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే ఈ అమ్మాయి… ఇప్పుడు క్యూ అండ్‌ ఎ పెట్టే స్థాయికి ఎదిగిపోయింది. అంతలా వైరల్‌ అవ్వడానికి కారణం వర్మ ట్వీట్‌ చేసిన ఓ చిన్న వీడియో. అంతలా వైరల్‌ అయ్యింది అంటున్నారు, వర్మ కన్ను పడింది అంటున్నారు. బోల్డ్‌ భామనా అని అడుగుదాం అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎంచక్కగా సంప్రదాయ బద్దంగా చీరకట్టులోనే వీడియోలు చేస్తూ ఉంటుంది.

కేరళకు చెందిన ఈ కుట్టి… అందానికి ఆమె కురులు చక్కటి యాడ్‌ ఆన్‌ అని చెప్పాలి. చీర కట్టు, కురులతోనే ఆమె ఇన్‌స్టా రీల్స్‌ అదిరిపోతున్నాయి. అలా ఓ వీడియో కనిపించేసరికి వర్మ ట్వీట్‌ చేశారు. దానికి ఆమె ఎవరు అనే వివరాలను నెటిజన్లు చెప్పారు. అలా ఆమె వైరల్‌ కావడంతో ఇప్పుడు ప్రశ్న – జవాబు కార్యక్రమం పెట్టింది. అందులో ఆసక్తికర విషయాలు చెప్పింది. తన వయసు 22 ఏళ్లు అని చెప్పిన శ్రీలక్ష్మీ… ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివానని తెలిపింది.

వర్మ (Ram Gopal Varma) నీ వీడియోలు షేర్ చేశాక లైఫ్ ఎలా ఉంది? అని ఓ నెటిజన్‌ అడిగితే… ఏముంది అంతా సేమ్‌ టు సేమ్‌. కానీ సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెరుగుతున్నారు అని చెప్పింది. అంతేమరి వర్మ మనసుపడితే ఇలానే ఉంటుంది. మరి ఆమె సినిమాల్లోకి వస్తుందా లేదా అనేది కాలమే చెబుతుంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus