గ్రూప్ తగాదాలు, కక్షల నేపథ్యంలో సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్ స్టర్ నయీమ్ పై సినిమా తీయనున్నట్లు ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితం పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించిన హంతకుడు నయముద్దీన్ ఆస్తులు, ఆప్తులపై విచారణ సాగుతోంది. అతని క్రూరమైన చర్యలు రోజుకొకటి బయట పడుతున్నాయి. నయీమ్ విషయాలను పేపర్లో చూసి స్పందిన వర్మ.. అతని గురించి ఒక సినిమాతో చెప్పలేము, మూడు పార్ట్ లుగా తీయాలని అనుకున్నట్లు మంగళ వారం ట్వీట్ చేసాడు.
గతంలో పరిటాల రవి కుటుంబ కక్షలను ఆధారం చేసుకుని రక్త చరిత్రను రెండు పార్టులుగా తీసి వర్మ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విజయవాడ లో రెండు వర్గాల మధ్య పోరును “వంగవీటి” అనే సినిమాతో తెరకెక్కిస్తున్నాడు. హెచ్చరికలు, రిక్వెస్ట్ ల కారణంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలా? మార్పులు చేయాలా ? అని ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి సర్కార్ 3 ని రూపొందించే పనిలో ఆర్జీవీ ఉన్నాడు. క్రిమినల్ నంబర్ వన్ గా పేరుగాంచిన అండర్ వరల్డ్ డాన్ నయీమ్ పై సినిమాను ప్రకటించి మాలీ వార్తల్లోకి ఎక్కాడు. దీనిపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు అభినందిస్తుంటే.. మరికొంతమంది ముందు వంగవీటి సినిమాను రిలీజ్ చేయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Just gathered entire information on Nayeemuddin from multiple sources..His crimes over the years are full of truly hair rising details
— Ram Gopal Varma (@RGVzoomin) August 23, 2016
Nayeemuddin’s transformation from a naxalite to a police informant to a underworld gangster to become an all time Criminal no.1 is scary
— Ram Gopal Varma (@RGVzoomin) August 23, 2016
Nayeemuddin’s story is so complex and with so much of content that it’s impossible to justify it by telling it in only one feature film
— Ram Gopal Varma (@RGVzoomin) August 23, 2016
Am going to make a 3 part film on the Nayeem story ..Rakthacharitra had only two parts..Nayeem will have 3 parts
— Ram Gopal Varma (@RGVzoomin) August 23, 2016