‘మెగాస్టార్’ తో వర్మ సినిమా!!!

ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయినటువంటి రామ్ గోపాల్ వర్మ తీరు చాల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన చేసే సినిమాలే కాదు ఆయన మాటలు సైతం చాలా వింతగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు ట్విటర్ ను వేదికగా చేసుకుని ఆయన చేసే వ్యాఖ్యలు కొన్ని సార్లు ప్రకంపనలు సృష్టిస్తాయి. అయితే ఇదిలా ఉంటే తాజాగా వర్మ తెలుగులో ‘వంగవీటి’ అనే సినిమాను తీస్తున్నట్లు, ఆ సినిమాలో ఒక పాటను, ఫర్స్ట్ లుక్ ను సైతం విడుదల చేసి తెల్గు రాష్ట్రాల్లో హీట్ పుట్టించాడు.

కానీ ఈ సినిమాపై అనేక విమర్శలు రావడంతో ఆ సినిమాను పక్కన పెట్టి బాలీవుడ్ కు వెళ్ళిపోయాడు. అయితే తెలుగులో..లేదంటే హిందీలో తన టాలెంట్ ను ఎప్పటికప్పుడు చూపిస్తున్న వర్మ అప్పట్లోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలు తీసి హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్ లో బిజీ ఆవుదాం అనుకుంటున్న వర్మ… ఒక కొత్త ఆఫీస్ పెట్టడమే కాకుండా…ఆఫీస్ కు కంపెనీ అని పేరు పెట్టుకుని.. అక్కడకు బిగ్ బిని ఇన్వైట్ చేశాడు. దొరికిందే అవకాశంగా, అదే కోవలో గ్ బితో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. వ్యక్తిగతంగా వర్మ ఎలాంటి వాడైనా…వర్మ టాలెంట్ గురించి బిగ్ బీ కు బాగా తెలుసు, అయితే ఆ చనువుతోనే అమితాబ్ తో సర్కార్ రాజ్ సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. అదేక్రమంలో ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ ఉండడు అని క్లారిటీ ఇచ్చాడు. రెండో పార్ట్ లో ఆ క్యారక్టర్ ఎండ్ అవ్వడంతో రాబోయే సినిమాలో అభిషేక్ ఉండే ఛాన్స్ లేదని తేల్చి చెప్పేసాడు వర్మ. మరి ఈ సినిమాను సర్కార్ రాజ్ ను మించి ఉంటుందో, లేకపోతే బిగ్ బీని ముంచుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus