RGV, Ajay Bhupathi: ‘ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం..’

  • January 4, 2022 / 09:49 PM IST

ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. వాటిని పరిష్కరించుకుంటూ వచ్చేవారు. ఆయనపై ఉన్న గౌరవంతో ఇండస్ట్రీ మొత్తం ఒకమాటపై నిలిచేవారు. కానీ ఆయన మరణం తరువాత పరిస్థితులు మారిపోయాయి. మొన్నటివరకు ‘మా’ ఎలెక్షన్స్ గొడవ జరిగింది. కొన్నిరోజులుగా టికెట్ రేట్ ఇష్యూ గొడవ నడుస్తోంది. ఈ విషయాల్లో ఇండస్ట్రీ పెద్దగా మాట్లాడేవారు కరువయ్యారు. మరోపక్క సినీ పరిశ్రమకు పెద్ద అనే హోదా తనకు అవసరం లేదని చిరంజీవి చెప్పడం..

టికెట్ రేట్ ఇష్యూ గురించి మోహన్ బాబు బహిరంగంగా లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో దర్శకుడు అజయ్ భూపతి మధ్యలోకి వచ్చి ఇండస్ట్రీ పెద్దగా రామ్ గోపాల్ వర్మ ఉండాలని కోరారు. ‘మా బాస్ రామ్ గోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలనేది నా కోరిక. సామీ మీరు రావాలి సామీ’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ విషయంలో చాలా మంది అజయ్ భూపతిపై విమర్శలు చేశారు.

కానీ ఆయన అవేం పట్టించుకోలేదు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్ పై స్పందించారు. ‘అజయ్ గారూ,ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతివాడికీ వేరే వేరే స్వార్థాలు ఉంటాయి. దాని మూలాన వాడికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడు వింటాడు కానీ, ఎవడికో పెద్దదిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవ్వడూ వినడు’ అని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus