పిభ్రవరి 26న విజయవాడ వెళుతున్న రాంగోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, విజయవాడ నేపథ్యంలో సాగే వంగవీటి రాధా, రంగాలపై ‘వంగవీటి’ అనే సినిమాను తెరకెక్కిస్తానని పెర్కొనడంతో అందరి చూపు ఇప్పుడు వర్మవైపే ఉంది. నిజ ఘటనల ఆధారంగా సినిమాలను తెరెక్కించడంతో వర్మ స్టయిలే సపరేట్. ‘శివ’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన వర్మ ‘వంగవీటి’ సినిమా తర్వాత తాను తెలుగులో సినిమా చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలో చదువుకోవడం వల్ల, వంగవీటి రాధా, మోహన్ రంగాలతో ఉన్న పరిచయం కారణంగా తనకు వారి గురించి తెలిసినంతగా మరెవరికీ తెలియదని తెలియజేసిన వర్మ ఈ ఫిభ్రవరి 26న విజయవాడ వెళ్ళనున్నారు.

వంగవీటి సినిమా గురించి మరింత రీసెర్చ్ చేయడానికి వంగవీటి కుటుంబ సభ్యులను, వంగవీటి సమయంలో ఉన్న వ్యక్తులను కలుసుకుని మరింత విషయసేకరణకు ఆయన విజయవాడ వెళుతున్నట్టుగా తెలియజేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus