మే 1న విడుదల కానున్న రాంగోపాల్ వర్మ ‘రాయ్’ ఫస్ట్ లుక్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్(ఎం.ఎల్.సి) నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాయ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మే 1వ తేది సాయంత్రం ముత్తప్ప రాయ్ పుట్టినరోజు సందర్భంగా యాబై వేల మంది ప్రజల మధ్యలో విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరులోని బిదాడి వేదిక అవుతుంది.

55 కోట్ల భారీ బడ్జెట్ తో లండన్, దుబాయ్, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించనున్నారు. సత్య, కంపెనీ వంటి విజయవంతమైన గ్యాంగ్ స్టర్స్ చిత్రాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యాన్సీ చెల్లించి ఈ సినిమా హక్కులను పొందారు. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను వేవ్ ఫిలింస్ అధినేత రాజు చద్దా, ఈరోజ్ ఇంటర్రేషనల్ సునీల్ లుల్లా కైవసం చేసుకున్నారు. అలాగే తమిళ హక్కులను సౌతిండియా ఫిలించాంబర్ అధ్యక్షుడు గంగరాజు సొంతం చేసుకున్నారు.

జీనియస్, రామ్ లీలా వంటి చిత్రాలను నిర్మించిన అన్ కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి సినిమాను నిర్మిస్తున్నారు. ఈయన రాయ్ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.

పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఆధ్వర్యంలో లేజర్ కిరణాలతో రాయ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు. మే 1న విడుదల కానున్న ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus