Ram Laxman: మేం వణికిపోతుంటే.. ఆయన అదరగొట్టారు.. రామ్‌ లక్ష్మణ్‌ కామెంట్స్‌ వైరల్‌

టాలీవుడ్‌లో యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌ – లక్ష్మణ్‌ అంటే ప్రత్యేక శైలి. సీనియర్‌ స్టార్‌ హీరోలకు వారు అందించే యాక్షన్‌ కొరియోగ్రఫీకి పెద్ద ఫ్యాన్‌ బేసే ఉంది. హీరోల బాడీ లాంగ్వేజ్‌ బట్టి వారు ఫైట్స్‌ రూపొందిస్తూ ఉంటారు. అలా తాజాగా వారు ‘అఖండ 2: తాండవం’ సినిమాకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మంచు పర్వతాల మధ్యలో బాలకృష్ణ చేసిన సాహసం గురించి చెప్పుకొచ్చారు.

Ram Laxman

గన్‌ శక్తిమంతమైనది. దానికి త్రిశూలం, దైవత్వం తోడైతే ఇంకా బలంగా మారుతుంది. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’లో పోరాట ఘట్టాలు అలానే ఉంటాయి అని రామ్‌లక్ష్మణ్‌ అంటున్నారు. అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించడం కోసం ఈ సినిమాలో 99 శాతం యాక్షన్‌ సన్నివేశాల్ని బాలకృష్ణ స్వయంగా చేశారని చెప్పారు. డూప్‌ అనే ఆలోచన వద్దని చెప్పారట బాలయ్య. ఈ సినిమాకి పనిచేయడం ఎంతో ప్రత్యేకమని చెప్పారు ఈ యాక్షన్‌ కొరియోగ్రఫీ బ్రదర్స్‌.

సినిమా సెట్‌లో బాలకృష్ణని చూస్తున్నప్పుడు ఒక దైవికశక్తిని చూస్తున్నట్టే ఉంటుందన్నారు. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణను అఘోరాగా పరిచయం మాత్రమే చేశారని.. ఇప్పుడు రెండో పార్టులో ఆ పాత్ర విశ్వరూపాన్ని చూస్తారని చెప్పారు. ఈ సినిమాలో బాలయ్య పాత్ర మూడు కోణాల్లో ఉంటుందని, అభిమానులను అలరించడాని బాలయ్య సాహసోపేతమైన సన్నివేశాల్ని చేశారని చెప్పారు. హిమాలయాల్లో చలికి తట్టుకోలేక కోట్లు వేసుకుని తాము సెట్‌కి వెళితే, బాలకృష్ణ తన పాత్రకు తగ్గట్టుగానే భుజాలు కనిపించే దుస్తులతోనే వచ్చారని తెలిపారు. ఆ దుస్తులతో గంటల తరబడి మంచు మధ్యలో చలిలో నిలబడి పోరాట సన్నివేశాల్ని పూర్తి చేశారని రామ్‌లక్ష్మణ్‌ చెప్పారు.

ఇక తమకు అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అబ్బాయి రాహుల్‌ని కూడా ఈ రంగంలోకి తీసుకొచ్చామని చెప్పారిద్దరూ. కొన్ని పోరాట ఘట్టాల్ని డిజైన్‌ చేస్తున్నప్పుడు ఇప్పుడు ట్రెండ్‌ ఇలా ఉంది, ఇలా చేద్దాం అని రాహుల్‌ సలహా ఇస్తుంటాడట. త్వరలోనే తనను యాక్షన్‌ డైరెక్టర్‌గా పరిచయం చేస్తామని చెప్పారు రామ్‌లక్ష్మణ్‌.

నేను క్యాన్సర్‌ని ఎలా జయించానంటే.. స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus