Ram Pothineni: రామ్ లైనప్ లో హిట్ డైరెక్టర్?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram) తన సినిమాల ఎంపికలో ఈ మధ్య కొంత ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar)  తరహా మాస్ హిట్ తర్వాత వరుసగా కమర్షియల్ సినిమాలతో ప్రయత్నాలు చేసినా, కొన్నింటి రిజల్ట్ ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకే ఇప్పుడు కొత్త జానర్స్ ట్రై చేయాలని రామ్ డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం రామ్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty)  డైరెక్టర్ మహేష్ బాబు (Mahesh Babu P) దర్శకత్వంలో ఓ లవ్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Ram Pothineni

అదే సమయంలో మరో డిఫరెంట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దశలో ఉన్నట్లు టాక్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రామ్ తన తదుపరి సినిమాను హిట్ ఫ్రాంచైజీతో గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలనుతో (Sailesh Kolanu) చేయనున్నాడట. హిట్ 3 (HIT 3)  పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పటికే డిస్కషన్స్ జరుపుతోందట. ఈ కథ రామ్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని, యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ స్టైల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది.

రామ్ ఇప్పటి వరకు ఎక్కువగా మాస్, రొమాంటిక్ కథలు ఎంచుకున్నాడు. కానీ ఓ మిస్టరీ థ్రిల్లర్‌లో మెయిన్ లీడ్‌గా కనిపించడమంటే కొత్త ప్రయోగమే. కథ నడిపించే విధానం, పాత్రలకు ఉన్న స్కోప్ అన్నీ కలిపి సినిమా హై ఇంటెన్స్ లెవెల్‌లో ఉండబోతోందని టాక్. శైలేష్ ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నాడని, రామ్ కూడా ప్రాధమికంగా ఆసక్తి చూపిస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.

ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా రామ్ (Ram Pothineni) మరికొన్ని కథలు వినబోతున్నాడా? అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, రామ్ హరీష్ శంకర్ (Harish Shankar), దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్‌లో కూడా ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు టాక్ ఉంది.

హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus