Ramana Gogula: రీ-ఎంట్రీలో రమణ గోగుల డిమాండ్.. మామూలుగా లేదుగా..!

సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎవ్వరూ ఊహించని ఈ సినిమా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎగబడి చూశారు. కొన్నాళ్ల నుండి థియేటర్లకు వెళ్లడం తగ్గించిన జనాలను కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లకు రప్పించింది. గ్రామాల్లో మూతపడ్డ థియేటర్లు.. ఈ సినిమాతో దాదాపు నెల రోజుల పాటు కళకళలాడాయి. థియేటర్ హౌస్ ఫుల్ అయిపోయినా సరే.. ఎక్స్ట్రా చెయిర్స్ వేసి మరీ జనాలను కూర్చోబెట్టారు థియేటర్ ఓనర్లు.

Ramana Gogula

ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో డీసెంట్ షేర్స్ సాధిస్తుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా వచ్చి నెల దాటినా.. కొత్త సినిమాలు ఎన్నో వస్తున్నా, రోజుకి ఒకటి, రెండు షోల చొప్పున వేస్తూ కూడా ఇంకా రన్ ను పొడిగిస్తున్నాయి థియేటర్ యాజమాన్యాలు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కంటే పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ.. ఈ సినిమా మాత్రమే ఇన్ని రికార్డులు నెలకొల్పడానికి ముఖ్య కారణం ‘గోదారి గట్టు’ సాంగ్ అనే చెప్పాలి. 2025 లో ఫస్ట్ చార్ట్ బస్టర్ సాంగ్ ఇదే అని చెప్పాలి.

ఇక ఈ పాటని పాడింది సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 12 ఏళ్ళ తర్వాత ఆయన టాలీవుడ్ కి సింగర్ గా రీ- ఎంట్రీ ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజి’ (OG Movie)  సినిమాలో కూడా ఓ పాట పడుతున్నారు రమణ గోగుల (Ramana Gogula) . అయితే ఆయన పాట పాడినందుకు కూడా గట్టిగానే ఛార్జ్ చేస్తున్నారట. రమణ గోగుల ఇప్పుడు ఒక పాట పాడటానికి రూ.5 లక్షలు పారితోషికంగా తీసుకుంటున్నారట.

పలు మ్యూజిక్ ఛానల్స్ వాళ్ళు.. పెద్ద సింగర్స్ పాడిన పాటలకి భారీ రేటు చెల్లించి తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వ్యూయర్ షిప్ లేదా ప్లే చేసిన టైంని బట్టి.. జెనరేట్ అయిన డబ్బులో కూడా కొంత వాటా మేకర్స్ కి ఇస్తారని తెలుస్తుంది. సో ఆడియో రైట్స్ సేల్ అవ్వడం కోసం.. ఇలా రమణ గోగుల వంటి స్టార్స్ తో పాటలు పాటిస్తారు అని స్పష్టమవుతుంది.

పాత సినిమా, కొత్త ప్రాజెక్ట్‌ సీక్వెల్స్‌ ప్రకటించిన త్రినాథరావు నక్కిన!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus