రమణ గోగుల (Ramana Gogula) ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన వాయిస్ చాలా పెక్యులర్ గా ఉంటుంది. ఈయన మ్యూజిక్ అందించిన చాలా తెలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ కూడా అందించారు. ‘తమ్ముడు’ (Thammudu) ‘బద్రి’ (Badri) ‘ప్రేమంటే ఇదేరా’ (Premante Idera) ‘లక్ష్మీ’ (Lakshmi) వంటి సినిమాల్లోని పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. విక్టరీ వెంకటేష్ (Venkatesh) – రమణ గోగుల కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తర్వాత ఎందుకో ఈ కాంబో సెట్ అవ్వలేదు.
Ramana Gogula
అయితే అనిల్ రావిపూడి (Anil Ravipudi) వల్ల ఈ కాంబో మళ్ళీ సెట్ అయ్యింది. అలా అని వెంకీ సినిమాకి రమణ గోగుల మ్యూజిక్ అందిస్తున్నాడని కాదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ‘గోదారి గట్టు మీద రామ సిలకవే..గోరింటాకెట్టుకున్న సందమామవే’ అంటూ సాగే ఓ పాట ఉంది. దీనిని రమణ గోగులతో పాడించినట్టు దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ (Bheems Ceciroleo) , లిరిసిస్ట్ భాస్కర్ భట్ల ఓ వీడియో ద్వారా తెలియజేశారు.
‘ట్యూన్ అదిరిపోయింది.. భాస్కర్ భట్ల లిరిక్స్ ఎప్పటిలానే సూపర్ గా ఉన్నాయి. అయితే ఈ పాటను ఓ పెక్యులర్ వాయిస్ ఉన్న సింగర్ పాడితే బాగుంటుంది’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి అంటుంటే… రమణ గోగుల (Ramana Gogula) రిఫరెన్స్..లు వచ్చాయి. ‘బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే’ వంటి పాటలకి సంబంధించిన విజువల్స్ చూపించారు.
అప్పుడు సంగీత దర్శకుడు భీమ్స్… ‘రమణ గోగుల లాంటి వాయిస్ ఏంటి? .. ఆయనతోనే పాడించేద్దాం?’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రమణ గోగుల ఎంట్రీ ఇవ్వడం ఈ వీడియోకి హైలెట్ అయ్యింది. 2006 లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా తర్వాత.. అంటే 18 ఏళ్ళ తర్వాత వెంకటేష్ సినిమాలోని పాటని రమణ గోగుల పాడటం జరుగుతుందన్న మాట.
A special song calls for a very special singer to bring the magic to life❤️
After 18 Long years, Bringing back the blockbuster vintage combo of Victory @VenkyMama and @RamanaGogula for a chartbuster tune composed by #BheemsCeciroleo