Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ
- November 7, 2026 / 12:14 AM ISTByPhani Kumar
రన్బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రామాయణం'(Ramayana). యష్ రావణాసురుడి పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్స్ కూడా ముఖ్యపాత్రలు పోషించారు. దాదాపు రూ.2000 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నమిత మల్హోత్రా నిర్మించగా.. నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే నమ్మకాన్ని సంపాదించింది.
Ramayana

అంచనాలు కూడా పెరిగాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ‘రామాయణం’ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ బాగున్నప్పటికీ.. కథనంలో ల్యాగ్ ఉందంటూ కంప్లైంట్స్ వినిపించాయి. అయినప్పటికీ మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే
| నైజాం | 2.05 cr |
| సీడెడ్ | 0.30 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.22 cr |
| కర్ణాటక | 4.4 cr |
| తమిళనాడు | 1.6 cr |
| కేరళ | 0.9 cr |
| నార్త్ | 28 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.5 cr |
| ఓవర్సీస్ | 28 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 68.97 cr |
‘రామాయణం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.800 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.800 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంటే ఆల్మోస్ట్ రూ.1600 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.35 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇందులో చాలా వరకు ‘టాక్సిక్’ సినిమాతో నష్టపోయిన వారికి కాంపెన్సేషన్ గా రేట్లు తగ్గించి ఇచ్చారు. ఏదేమైనా ఇక్కడ కూడా రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.68.97 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.132 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.731 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు రూ.3.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.32.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..















