Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’
- September 13, 2026 / 12:52 AM ISTByPhani Kumar
అల్లరి నరేష్ ఖాతాలో హిట్టు పడి చాలా కాలం అయ్యింది. కొంచెం రూటు మార్చి చేసిన సీరియస్ సినిమా ‘నాంది’ డీసెంట్ సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత నరేష్ చేసిన సినిమాలు అన్నీ పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ‘ఉగ్రం’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ‘బచ్చలమల్లి’ ’12A రైల్వే కాలనీ’ వంటి సినిమాలు అన్నీ నరేష్ కి చేదు ఫలితాలే మిగిల్చాయి. అయితే ఇప్పుడు ‘రంభ ఊర్వశి మేనక'(Ramba Oorvasi Menaka) అనే కామిడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదనిపించే టాక్ తెచ్చుంది.
Ramba Oorvasi Menaka Collections

దీంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మొదటి సోమవారం కలెక్షన్స్ అనుకున్న దానికంటే కొంచెం తగ్గాయి. ఇక వీక్ డేస్ లో ఈ సినిమా అనుకున్న రేంజ్లో కలెక్ట్ చేయలేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.82 cr |
| సీడెడ్ | 0.19 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.06 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.07 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 0.20 cr |
| ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.28 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 2.55 cr(షేర్) |
‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 7 రోజులు పూర్తయ్యే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.2.55 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కొరకు మరో రూ.2.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ ఓపెనింగ్స్ తో బ్రేక్ ఈవెన్ అనేది కష్టమనే చెప్పాలి.















