Ramcharan : ‘పెద్ది’ రిలీజ్ కి ఆ నిబంధనలు అడ్డు రానున్నాయా..?

ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సక్సెస్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, తమిళ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ 2025 సంక్రాంతి బరిలో నిలవగా అభిమానుల అంచనాలు అందుకోలేక బాక్సఫీస్ దగ్గర బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సారి తన తదుపరి మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు చరణ్. అదే ప్లానింగ్ లో భాగంగా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా తో రంగస్థలం తరహాలో ఒక భారీ సినిమా సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘పెద్ది’ సినిమా రానున్న మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.ఇప్పుడు ఈ సినిమా విడుదలకు కొత్తగా ఒక అడ్డంకి వచ్చి పడింది. అదేంటంటే..

Ramcharan

ఈ మధ్య తెలంగాణాలో సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు అనేది ఎక్కువగా వివాదాలకు దారి తీస్తున్న విషయం అందరికి తెలిసిందే. రీసెంట్ గా ఇదే విషయం పై తెలంగాణ హైకోర్టు 90 రోజుల నిబంధన కి సంబందించి కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం, ఏదైనా భారీ బడ్జెట్ సినిమా విషయంలో టిక్కెట్ల రేట్ పెంపు కోరాలంటే, సినిమా విడుదలకు 90 రోజుల ముందే రాష్ట్రప్రభుత్వాల పర్మిషన్ కు అప్లై చేసుకోవాలంట. లేని పక్షంలో టిక్కెట్ల రేట్లు హైక్ అనేది కుదరదు అని తేల్చి చెప్పింది.

ఇప్పుడు ఈ నిబంధన ‘పెద్ది రిలీజ్ కు అడ్డుగా మారేలా కనిపిస్తోంది. ఒకవైపు చూస్తే పర్మిషన్ కోసం 90 రోజుల టైం లేదు మరొక వైపు పెద్ది చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది కాబట్టి టికెట్ రేట్లు పెంచకుండా నిర్మాతలు రిలీజ్ చెయ్యలేరు. దాదాపుగా 75% షూటింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేక మరికొంత సమయం తీస్కొని టికెట్ రేట్ల పెంపుతో రిలీజ్ అవుతుందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Mahesh Babu : ‘హ్యాపీ బర్త్ డే NSG’ : మహేష్ బాబు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus