విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లైగర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ దగ్గరనుండి భారీ హైప్ ను సొంతం చేసుకుంది కాబట్టి.. అంచనాలు కూడా భారీగా పెరిగాయి. సినిమా ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ మొదటి రోజు మాత్రం మంచి కలెక్షన్లు సాధించింది ‘లైగర్’. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీకి తెలుగు కంటే ఎక్కువగా హిందీలో ప్రమోషన్స్ చేశారు.
ఈ కారణంగా అక్కడ కూడా ‘లైగర్’ మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్ర కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. అక్కడక్కడా ఓవర్ గా అనిపించినప్పటికీ.. రమ్యకృష్ణ తన మార్క్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది. ఈ చిత్రం కోసం ఆమె పారితోషికం కూడా గట్టిగానే అందుకుందని ఇన్సైడ్ టాక్.
అందుతున్న సమాచారం ప్రకారం.. ‘లైగర్’ చిత్రానికి రూ.1.5 కోట్ల పారితోషికం రమ్యకృష్ణకి అందినట్టు తెలుస్తోంది.అంటే ఓ హీరోయిన్ కు ఇచ్చినట్టే రమ్యకృష్ణకి కూడా పారితోషికం ఇచ్చినట్టు. మదర్ క్యారెక్టర్ కు ఈ రేంజ్ పారితోషికం ఏంటి అనే అనుమానం అందరికీ రావచ్చు. అందుకు కారణం లేకపోలేదు. ‘బాహుబలి'(సిరీస్) తో రమ్యకృష్ణ హిందీలో శివగామిగా బాగా పాపులర్ అయ్యింది.
హిందీలో సినిమాని మార్కెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని భావించి రమ్యకృష్ణకి భారీ పారితోషికం ఇచ్చారని స్పష్టమవుతుంది. ‘పూరి కనెక్ట్స్’, ‘బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ’ ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!