Ramya Krishna: బాలీవుడ్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ!

  • August 29, 2022 / 08:39 AM IST

దక్షిణాది సిని ఇండస్ట్రీలో పలు భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె ఇప్పటికీ పలువురు యంగ్ హీరోలకు తల్లి పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే తనకు హిందీలో అవకాశాలు వచ్చాయని చెప్పారు. అప్పటికే తాను హిందీలో దయావన్, పరంపర, ఖల్నాయక్, చాహత్, బనారసి బాబు, బడే మియాన్ చోటే మియాన్ వంటి చిత్రాల్లో నటించానని తెలిపారు.

ఇక తాను నటించిన హిందీ సినిమాలు పెద్దగా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.ఇలా బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే తాను తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యానని అయితే ఇక్కడ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని అక్కడ స్టార్ డమ్ సంపాదించుకునే ధైర్యం చేయలేకపోయానని ఈ సందర్భంగా రమ్యకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం లైగర్ సినిమా ద్వారా మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారని చెప్పాలి.ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ ఇందులో రమ్యకృష్ణ మాస్ పెర్ఫార్మెన్స్ మాత్రం హై లెవెల్ అని చెప్పాలి. ఇలా ఈమె తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus