Ramya Raghupathi: ఓటీటీలో విడుదలకు నోచుకోని మళ్లీ పెళ్లి!

నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి ఈ సినిమా ద్వారా వీరిద్దరూ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితేపవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక నరేష్ వ్యక్తిగత జీవిత ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తుంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకారణ పొందలేదని చెప్పాలి.

ఇక ఈ సినిమా నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా చేయడమే కాకుండా ఇందులో (Ramya Raghupathi) రమ్య రఘుపతి పాత్రను కూడా సృష్టించారు. ఈ పాత్రలో నటి వనిత విజయ్ కుమార్ నటించారు. ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు రమ్య రఘుపతి ఈ సినిమా విడుదలను ఆపివేయాలి అంటూ కోర్టును ఆశ్రయించగా ఇది కేవలం సినిమా మాత్రమేనంటూ నిర్మాతలు చెప్పడంతో ఈ సినిమాని విడుదల చేశారు. ఈ విధంగా థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా ఆదరణ పొందలేకపోయింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆహా, అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేశారు. నేటి నుంచి ఈ సినిమా నేటి నుంచి ఓటిటిలో ప్రసారం కానుంది అయితే రమ్య రఘుపతి ఈ సినిమాని ఓటీపీలో కూడా ప్రసారం చేయకుండా నిలిపివేయాలి అంటూ అమెజాన్ వారికి, ఆహా వారికి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేయటం వల్ల ఈ సినిమా చాలామందికి చేరువయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తన పాత్ర గురించి ఈ సినిమాలో ప్రస్తావించడం వల్ల తన పరువుకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని,

ఈ సినిమా కారణంగా తనకు అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఈ సినిమా ప్రసారం నిలిపివేయాలంటూ రమ్య రఘుపతి తరపు న్యాయవాది నోటీసులు జారీ చేశారు. ఈ విధంగా రమ్య రఘుపతి నోటీసులను జారీ చేయడంతో అమెజాన్ ప్రైమ్ వారు మళ్లీ పెళ్లి సినిమాని తమ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి ఆపివేశారు.ఆహా మాత్రం ప్రసారం చేస్తుంది మరి ఈ విషయంపై ఆహా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus