‘కంచర పాలెం’ లోని డైలాగ్స్ పై రానా కామెంట్

భారీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పెద్ద చిత్రాలను నిర్మించడమే కాదు.. చిన్న చిత్రాలను సైతం ప్రోత్సహిస్తోంది. తనకి నచ్చిన సినిమాని సురేష్ బాబు సొంతంగా రిలీజ్ చేసే బాధ్యతలను తీసుకుంటున్నారు. “పెళ్ళిచూపులు”, “మెంటల్ మదిలో” వంటి సినిమాలకు అండగా నిలిచిన సురేష్ బాబు.. “కేరాఫ్ కంచరపాలెం” చిత్రాన్నీ తీసుకున్నారు. మహా వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అలాగే ఈ సినిమాని ముందుగానే చూసిన రాజమౌళి, క్రిష్, కీరవాణి లాంటి ప్రముఖులు ఈ చిత్రాన్ని తప్పక చూడమని సూచించారు. అయితే ఈ చిత్రంలో బూతులు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై రానా స్పందించారు. “మన జీవితంలో భాగంగా అసహాయతను.. అసంతృప్తిని ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తం చేస్తారు. ఆ క్రమంలో కొందరు బూతులు మాట్లాడతారు. “కంచర పాలెం”లోని పాత్రలు కూడా అలా మాట్లాడతాయి. అంతే తప్ప వీటిని బూతులుగా చూడకండి.

సన్నివేశ పరంగా చూస్తే అలాంటి భావన కలగదు. ఇందులో అన్ని అంశాలూ సహజంగా ఉంటాయని.. ఆ సహజత్వం నచ్చే సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాను” అని రానా వివరించారు. ఇంకా అతను మాట్లాడుతూ.. “”కంచర పాలెం” పూర్తయ్యాక టేకప్ చేయడమే మంచిది అయింది. స్క్రిప్టు నచ్చి మేము ప్రొడ్యూస్ చేసినట్లయితే ఇంత సహజంగా సినిమా ఉండేది కాదు. సెట్లు వేసి.. పేరున్న ఆర్టిస్టుల్ని పెట్టుకుని సినిమా చేస్తే సినిమా భిన్నంగా తయారై ఉండేది. దర్శకుడు వెంకటేష్ మహా నిజాయితీతో తీసిన సినిమా ఇది. తప్పకుండా విజయం సాధిస్తుంది” అని రానా ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే నెల 7 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus