సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రాణా బర్త్ డే ఫోటో!

  • December 17, 2018 / 01:31 PM IST

ఇటీవల రాణా తన పుట్టినరోజు సందర్భంగా తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రయివేట్ పార్టీలో రాణా క్లోజ్ ఫ్రెండ్స్ తోపాటు చరణ్, అఖిల్ లు కూడా పాల్గొన్నారు. ఇది జరిగి చాలా రోజులవుతుంది కదా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా. వాళ్ళు కూడా అదే అనుకున్నారు కానీ.. ఈ పార్టీ ఫోటోల్లో అఖిల్ వెనుక ఒక మందు గ్లాస్ ఉంది. అది అఖిల్ దా లేక మరొకరిదా అనే విషయం తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం ఆ గ్లాస్ లో మందు తాగింది అఖిలా లేక వేరొకరా అని డిస్కస్ చేసుకుంటూ.. సోషల్ మీడియాలో సదరు ఫోటోను భీభత్సంగా సర్క్యులేట్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ అన్నాక డ్రింక్ పార్టీస్ లో ఎంజాయ్ చేయడం అనేది చాలా కామన్.

కానీ.. అక్కడున్నవాళ్లందరిలో అఖిల్ చిన్నోడు కాబట్టి ఈ తరహా డిస్కషన్ కు తెరలేపడం జరిగింది. ఈ విషయమై అఖిల్ కానీ రాణా కానీ స్పందించాల్సిన అవసరం లేకపోయినా.. ట్విట్టర్ లో జనాలు మాత్రం తెగ డిస్కస్ చేసేస్తున్నారు.

2

3

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus