మొత్తానికి రానా క్లారిటీ ఇచ్చేసాడు..!

ఇటీవల వచ్చిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలలో చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించాడు దగ్గుబాటి రానా. అయితే ఇది అతిధి పాత్రే. గత రెండేళ్ళ నుండీ రానా హీరోగా నటించిన సినిమా రాలేదు. ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత రానా మళ్ళీ హీరోగా నటించలేదు. అయితే ‘నీది నాది ఒకే కథ’ వంటి డీసెంట్ హిట్ తీసిన డైరెక్టర్ వేణు ఊడుగుల డైరెక్షన్లో… రానా హీరోగా ‘విరాట పర్వం 1992’ అనే చిత్రం రాబోతుందని గతకొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందని కూడా టాక్ నడిచింది. దాదాపు 40 కోట్లతో ఈ చిత్రం రూపొందనుందని… అయితే నిర్మాతల ఆర్ధిక సమస్యల వల్ల ఈ చిత్రం ఆగిపోయిదని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఫై రానా స్పందించాడు. త్వరలోనే సాయి పల్లవి తో నటించబోతున్నానని రానా క్లారిటీ ఇచ్చాడు. జూన్ మొదటి వరం నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వేలాలనుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుండగా… రానా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus